తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం బయటపడింది.100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్నారు ఆర్టీసీ కండక్టర్లు.
మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్తున్న టీఎస్34టీఏ5189 బస్సులో కండక్టర్ గండీడ్, జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగం అంతా ఫోన్లో చిత్రీకరించాడు.
అయితే తమ డిపోలో 97 శాతం, 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్- సీట్ల భర్తీ నిష్పత్తి) నమోదవుతోందని కొందరు డిపో మేనేజర్లు ఇస్తున్న నివేదికలపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఓఆర్ ఎలా పెరిగిందని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు జారీచేసే ‘జీరో’ టికెట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.