కెసిఆర్ కుటుంబం వల్లే హెచ్సీఏ లో ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. తన కుమార్తె కవితను హెచ్సీఏ అధ్యక్షురాలిగా చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. గతంలో తనని హెచ్సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయవద్దని కెసిఆర్ కోరారని.. రాజకీయాలలో ఉన్న నాకు హెచ్సీఏ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారని తెలిపారు వివేక్.
అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లలో కల్వకుంట్ల కుటుంబం ఉండాలని కవిత ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దానిని నేను అడ్డుకున్నందుకే కేటీఆర్ మా ప్యానల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించారని వండిపడ్డారు. క్రికెట్ టికెట్ల అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. టికెట్ల గందరగోళానికి కారణం కేటీఆర్.. కల్వకుంట్ల కుటుంబ సభ్యులేనని ఆరోపించారు.