ఇప్పుడున్న ‘TS’ నంబర్ ప్లేట్ “TG”గా మార్చుకోవాలా? వద్దా ?

-

తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు బిగ్ అలర్ట్. వాహనాలకు టీఎస్ ప్లేస్ లో టీజీగా మరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాల పరిస్థితి ఏంటి అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతుంది.

TS number plate

అయితే పాత వాహనదారులు టీజీగా మార్చుకోవాలని ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయడం లేదు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వెహికల్స్ కు మాత్రమే టిజి నెంబర్ ప్లేట్ వస్తుంది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లు కూడా మార్చాలని నిర్ణయిస్తే సర్కార్ దానిపై ప్రకటన చేయనుంది. అప్పటివరకు టీఎస్ గానే ఉంటాయి.

కాగా,దీనిపై పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు టీజీ అనే అప్రూవల్ ఇచ్చిందని తెలిపారు. దానిని గత ప్రభుత్వం టిఎస్ గా మార్పు చేసిందని వివరించారు. తెలంగాణ టీజీ గానే ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మిగతా నాలుగు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news