AP : నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కాసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ఈ సందర్బంగా నిర్ణయం తీసుకున్నారు. దింతో ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.. ఎల్లుండి(7న) బడ్జెట్ ఉంటుంది. అటు బీఏసీని బాయ్‌కాట్ చేసింది టీడీపీ.
కాగా, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ.. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికం గా లబ్ధిపొందారని చెప్పారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేసారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం. పేద పిల్లల కు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.