కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు చాలా కామన్. అయితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్లు ప్రకటించలేదు. మరో వారం రోజుల్లో టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొట్టుకొని బూతులు పగలగొట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని ప్రజల ముందే మూతులు పగిలేలా కొట్టుకున్నారు కాంగ్రెస్ వాటి కార్యకర్తలు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పొన్నం ప్రభాకర్ మరియు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వర్గాలు బహిరంగంగా కుస్తీ పోటీకి దిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాస్తవానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి మంచి పలుకుబడితోపాటు ప్రజాబలం ఉంది.
కానీ కరీంనగర్లో పోటీ చేయాల్సిన పొన్నం ప్రభాకర్ మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలో పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ వర్గాల మధ్య తాజాగా వివాదం చోటుచేసుకుంది. ఇది ఇలా ఉండగా హుస్నాబాద్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా వొడిదల సతీష్ బాబు ఉన్న సంగతి తెలిసిందే.
https://x.com/TeluguScribe/status/1704002808318714145?s=20