వన్ మ్యాన్ షో..జగన్‌తోనే వైసీపీకి గెలుపు.!

-

రాష్ట్రంలో పార్టీ స్థాపించిన అనతి  కాలంలోనే జగన్మోహనరెడ్డి  ఎక్కువ మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు.  వైసీపీ అంటే మరే ఇతర పేర్లు వినిపించవు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు తప్ప. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏది చేసినా జగన్ మాత్రమే చేస్తారు అని ప్రజలలోకి బాగా ప్రచారం జరిగింది. గ్రామస్థాయి నేతల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రతి చిన్న విషయాన్ని జగన్ దృష్టిలో ఉంచి చేస్తారు అని వైసిపి నేతలే అంటున్నారు.

2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనం సృష్టించారు. 175 నియోజకవర్గాలలోను పోటీ చేసిన ఎమ్మెల్యేతో పని లేకుండా జగన్‌ను  చూసి మాత్రమే ఓటు వేశారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎన్ని పార్టీలు తనపై  కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసిన  జగన్ ఒక్కడే సమర్థవంతంగా ఎదుర్కొనగలడని వైసీపీ నాయకులు అంటున్నారు.

ఈసారి జరగబోయే ఎన్నికల్లో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాత్రమే ఓటు వేయాలని జగన్ ప్రజలలోకి  వెళుతున్నారు. జగన్ ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చామని జగన్, వైసీపీ నేతలు అంటుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం అభివృద్ధి శూన్యం అంటూ, అవినీతి జరిగింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల జనసేన టిడిపి కలసి జగన్ ని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తోడేళ్ల గుంపు ఎన్ని వచ్చినా సింహం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. ఒంటరిగానే పోటీ చేస్తుంది. అంటూ జగన్ గురించి అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీలు ఎవరితో పోటీ చేసినా వైసిపి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని, అధికారాన్ని చేపడుతుందని వైసీపీ నేతలు అంతా ధీమాతో ఉన్నారు. ప్రజా నాడి బట్టి చూస్తే జగన్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. ఆ ఇమేజ్ బట్టే వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉంది. కేవలం జగన్ బొమ్మతోనే వైసీపీ మళ్ళీ  అధికారంలోకి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news