కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్

-

కామారెడ్డిలో ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపై బీసీల రిజర్వేషన్లు పెంచనున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్. బీసీల రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంపు. బీసీల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బీసీ సబ్ ప్లాన్, ప్రతీ మండలానికి ఒక బీసీ గురుకుల స్కూల్ ఏర్పాటు, 50 సంవత్సరాలు దాటిన నేత కార్మికులకు పెన్షన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.10లక్షల రుణం. బీసీ డీ లో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ ఏ లోకి మార్పు చేయనున్నట్టు తెలిపారు.

అదేవిధంగా రూ.3లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయంబర్స్ మెంట్ కల్పిస్తాం. ప్రతీ మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, చాకలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలను అందజేత ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version