BREAKING: బీజేపీ నాయకులపై దాడి చేశాడు కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ తమ్ముడు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో ఓటేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. అయితే..తాజాగా నారాయణఖేడ్ లోని 175 పొలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై దాడి చేశాడు కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ తమ్ముడు నగేష్ షెట్కార్. బీజేపీ కార్యకర్తని కాలితో తన్నాడు నాగేష్ షెట్కార్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.