ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఓటు వేసేందుకు కదలి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ కవిత ఏమన్నారంటే..?

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్​కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ దృష్టికి తీసుకెళ్లింది. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్​ను కోరినట్లు కాంగ్రెస్ నేత నిరంజన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news