తూముకుంట కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల హంగామా..!

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

మేడ్చల్ జిల్లా తూముకుంట కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల హంగామా సృష్టించారు.  తూముకుంట బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి పై కాంగ్రెస్ కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి దాడి. కౌన్సిల్ సమావేశంలో జరుగుతుండగానే మున్సిపల్ వైస్ చైర్మన్ పై కుర్చీలతో దాడి చేశారు.  ఈ దాడిలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాణిరెడ్డి తలకు తీవ్రగాయమైంది. గత కొంతకాలంగా అవిశ్వాస తీర్మానాల విషయంలో కౌన్సిలర్ల మధ్య వివాదం  కొనసాగుతున్నది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని వైస్ చైర్మన్ కోరడంతో కౌన్సిల్ సమావేశంలోనే దాడి చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version