TSPSC : టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రకు చెందిన వ్యక్తికి చోటు!!

-

టీఎస్పీఎస్సీ బోర్డులో కలకలం రేగింది. టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రకు చెందిన వ్యక్తికి చోటు కల్పించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సైతం మళ్ళీ ఆంధ్ర అధికారులకు అవకాశం ఇవ్వడం ఏంటని చర్చ జరుగుతోంది. ఇటీవల ఏర్పాటైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యుల్లో ఆంధ్రకు చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చోటు కల్పించింది.

TSPSC exams all re-scheduled

రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి కాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సంధర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకడు.

అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్లో పదవీ విరమణ కావాల్సిన రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version