రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన

-

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఒకేసారి రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉందని ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

Congress government’s key announcement on farmer loan waiver

అన్నదాతల అప్పుల పూర్తి సమాచారం రాగానే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు రూ. 500 ఇస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు.. గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

ధాన్యంకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు. రైతులు…2600 క్విటాలుకు ధాన్యం అమ్ముతున్నారని… Msp కంటే తక్కువ వస్తే బోనస్ ఇస్తామన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డి తెలిపారు. ప్రస్తుతం Msp రైతులకు వస్తుందన్నారు. రైతు రుణమాఫీ మీలాగా మేము చేయమని… రుణమాఫీ విషయంలో.. మాకే అనుభవం ఉందన్నారు. ఒకే సారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news