ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు అవుతున్నాయి.. మరో రెండు గ్యారెంటీలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ జీవన్ తెలిపారు. ఉచిత బస్ ప్రయాణం వల్లనే మేడారం జాతరకు మహిళా భక్తులు పోటెత్తారని పేర్కొన్నారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం.. ఉద్యోగులు గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో స్థానికతకు దూరంగా వెళ్లారు.
జీవో 46, జీవో 317లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయమన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం ఒకజోన్ ఉండేవిధంగా ఉంటే మంచిది. ఉమ్మడి కరీంనగర్ 4 జోన్లుగా విభజించారు. దీంతో జూనియర్లు చేరిన చోట ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు. సీనియర్లు అందరూ దగ్గరగా ఉండే చోటుకు వెళ్తే.. ఆ జోన్ లో పదవీ విరమణ జరిగి ఉద్యోగ ఖాలీలు ఏర్పడుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే సవరణలుంటాయి. ఏప్రిల్ చివరి వారం లోపుకమిటీ నివేదిక ఇస్తే.. సంతోషం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.