దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదు…అందుకే సన్న బియ్యానికే బోనస్ – కోదండ రెడ్డి

-

కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డు బియ్యం ఎవరూ తినరు కాబట్టి సన్న బియ్యానికే బోనస్ ఇస్తామంటున్నాం తప్పేంటి అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. పక్క రాష్ట్రాల నుంచి సన్న బియ్యం దిగుమతులు చేసుకుంటామని… అదే మనమే సన్న బియ్యం పండిస్తే.. ఎలాంటి సమస్యలు ఉండవని.. అన్నారు.

Congress Kisan Vice President Kodanda Reddy on paddy

అబద్దాలతో బీఆర్‌ఎస్‌ పార్టీ బతుకుతుంది… వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. కొనుగోలు కేంద్రాలు.. brs ప్రభుత్వం కంటే 15 రోజుల ముందే ఓపెన్ చేశామని వెల్లడించారు. గాలి మాటలు మాట్లాడటం కాదు.. ఆధారాలతో మాట్లాడండని కోరారు. గతంలో రోడ్ల మీదనే ధాన్యం ఉండేది.. మీరు తడిసిన ధాన్యం..మొలకలు వచ్చిన ధాన్యం మీరు కొనలేదని బీఆర్‌ఎస్‌ పార్టీపై ఫైర్‌ అయ్యారు. కానీ మేము తడిసిన ధాన్యం ని మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం…. మీ రాజకీయం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండని కోరారు కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news