హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉంది : చక్రధర్ గౌడ్

-

నా ఫోన్ టాపింగ్ కేసు లో హరీష్ రావు ఫై కేసు నమోదు అయ్యింది. సిద్దిపేట లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రనిత్ రావు, రాధాకిషన్ రావు, బుజంగ రావు నా ఫోన్ ట్యాప్ చేశారు అని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అన్నారు. హరీష్ రావు దగ్గరుండి నా ఫోన్ టాపింగ్ చేయించాడు. తనకు రాజకీయం గా అడ్డువాస్తున్నానని నాపై కక్ష్య పెంచుకున్నాడు. హరీష్ రావు కు నేను ఎప్పుడు భయపడడలేదు. హరీష్ రావు ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలి. 2023నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన కొట్లాడుతున్న. న్యాయం జరగ్గాకపోవడంతో కోర్టుకు వెళ్ళాను. నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నన్ను రాధకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు.

హరీష్ రావు చిన్నపిల్లగాడు ఏమి కాదు. ఎన్నో కుటుంబాలను ,వ్యాపారస్తులను లొంగదీసుకున్నారు. నా మీద 6కేసులు అయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లై మెసేజ్ వచింది. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేసాడు సంవత్సరం పాటు చేశారు. నా ఇంట్లో భార్య, తల్లితో ,డ్రైవర్ తో మాట్లాడింది అన్ని రికార్డ్ చేశారు. BRS ప్రభుత్వ హయాంలో కక్షలు, అక్రమ అరెస్టులు జరిగాయి. మంత్రి హరీష్ పీఏ హోం గార్డ్ జబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఆడియోను నేనే లికేజ్ చేసాను. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు ముందుకు రావాలి.. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు కీలకం. ఫోన్ ట్యాప్ కేసులో నేను కోర్టుకెళ్లను. నన్ను ఇబ్బందులు పెట్టి BRS పార్టీలోకి రమ్మన్నారు. నేను ఎన్నికల్లో నిలబడ్డాను బిఎస్పి తరుపున.. నిలబడ్డప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు తో నాకు ప్రాణహాని ఉందని డిజిపికి విన్నవించకున్న. హరీష్ రావు చేసినవాన్ని స్కాములే… సుద్దాపుస ఏం కాదు.. అన్ని బయటపెడుతా అని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version