పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేసి మేరిటైం హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. పోర్టుల ద్వారా రవాణా 450 మిలియన్ టన్నులు గుజరాత్ చేస్తుంటే.. ఏపీ 180 టన్నులు చేస్తోంది. షిప్ బిల్డింగ్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన. సీఎం చంద్రబాబు మెగా షిప్ యార్డు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మూడు త్రాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో, ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం లేకపోయింది. పులివెందుల, డోన్ నియోజకవర్గాలలో మంచినీటి ప్రాజెక్టులు, ఉద్దానం ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు.
గత ప్రభుత్వం క్రూరమైన ఆలోచనతో ప్రాజెక్టులు నాశన చేసారు. విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రానికి అన్యాయం చేసింది. PMAY అర్బన్, గ్రామీణ్, వన్ మన్ లలో పూర్తికాని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 26 మార్చి వరకు ఈ ఇళ్ళను పూర్తి చేయడానికి కేంద్రం సమయం ఇచ్చింది. అర్బన్, గ్రామీణ్ కలిపి 9.31 లక్షల ఇళ్ళు పూర్తవ్వాల్సి ఉంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం గా ఆయుర్వేద బోర్డుని మార్చడం జరిగింది. అలాగే ఏపీ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది అని పార్థసారథి పేర్కొన్నారు.