అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సారి ఎమ్మెల్సీ వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో మాట్లాడారు ఏఐసీసీ పెద్దలు.. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ జరిగింది.
కాసేపట్లో హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్.. సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉంది.. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు ఉంటుంది.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలన ఉందట.. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయట.