ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ ఉన్నాడట. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్, రోహిత్.. ఇక తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా…. రోహిత్ రిటైర్మెంట్ పై స్పందించారు శుబ్ మన్ గిల్. కెప్టెన్‌తో సహా అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉందని తెలిపారు. రోహిత్ భవిష్యత్తు గురించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, వ్యక్తిగతంగా తనతో కానీ రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చ చేయలేదని తెలిపారు.