Congress MLA Revuri Prakash Reddy: డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. రుణమాఫీ పై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పలేదని వెల్లడించారు. రుణమాఫీ చేయడానికి ఒక సంవత్సరం కచ్చితంగా పడుతుందని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదని బాంబు పేలిచారు. కచ్చితంగా ఏడాదికి ఎక్కువ సమయం పడుతుందని వివరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.