బతుకమ్మపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ కేవలం అగ్రకులాల వారే ఆడుతారు అంటూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణలో 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు.. కేవలం అగ్రకులాల వారే ఆడుతారన్నారు. రెడ్లు, వైశ్యులే ఆడుతారే తప్ప.. దళితులు, బహుజనులు ఆడిన సందర్భం లేదు వెల్లడించారు. దింతో బతుకమ్మపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.