తెలంగాణకు త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం బీసీ అధ్యక్షుడు, ఓసి ముఖ్యమంత్రి ఉన్నారని వివరించారు. ఎప్పుడైనా సమయం వస్తే “బీసీ ముఖ్యమంత్రి” అవుతారని బాంబ్ పేల్చారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/10/mallu-ravi.jpg)
బీసీలకు రాష్ట్ర మంత్రివర్గంలో 42% వాటా అమలుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీటు పోతుందని అందరూ చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు… తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.