కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేయండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు నర్సారెడ్డి. సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో.. గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.. కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి ఎన్ని అబద్ధాలు అయినా ఆడండి అని… బాంబు పేల్చారు. మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందని… అన్ని అబద్ధాలు ఆడిన పర్వాలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గారెంటీలతో మోసం చేశారని.. ఇప్పుడు మళ్లీ… ఎన్ని అబద్ధమైన ఆడేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారని ఫైల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అబద్ధాలు అయినా ఆడండి
మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది – గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి pic.twitter.com/XzMhXLcr5X
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025