టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు చేస్తోంది. తెలంగాణలో ఉద్యమకారులను వదిలేసి డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ఇదిలా ఉంటే మరోసారి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేశారు. కరోనా టైంలో రెమిడెసివీర్ ఇంజెక్షన్లను ప్రభుత్వం ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. రెమిడెసివిర్ వ్యవహారంలో పెద్ద స్కాం జరగిందని… తేలాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రెమిడెసివిర్ కు అనుమతి ఇచ్చింది ఎవరని.. మూడు నెలల తరువాత మళ్లీ దాన్ని తీసుకోవద్దని ఎందుకు రద్దు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫార్మా మాఫియా దీని వెలనకాల ఉందని… మనుషుల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. పార్థసారధి ఒక ఫార్మా స్కాంమర్ అని.. ఐటీ రైడ్స్ తరువాత ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వమే దాడులు చేయించి… మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తుందని విమర్శించారు.