పులివెందులలో హై టెన్షన్..నెలకొంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరితెగించారు కొంతమంది దుండగులు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డి తో పాటు అమరేశ్వర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలపై కూడా దాడికి దిగారు 30 మందికి పైగా దుండగులు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లినవారిపైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

అమరేశ్వర్ రెడ్డి తలకు బలమైన గాయం అయింది. సురేష్ రెడ్డి చేయి విరిగింది. ఇక అటు బాధితులను పరామర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. టీడీపీ నేతలే దాడి చేశారని ఆరోపించిన అవినాష్ రెడ్ఢి… ఆగ్రహించారు. అటు దాడితో తమకు సంబంధం లేదన్నారు టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి.
జెడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో 16 మందిపై బైండోవర్ కేసు నమోదు అయింది.