తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని చెబుతూ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు బయల్దేరారు. మొదటగా తెలంగాణ భవన్ చేరుకున్న నేతలు అక్కడ అల్పాహారం సేవించి బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. కేసీఆర్ మినహా మిగతా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బ్యారేజీ పరిశీలించనున్నారు.
అన్నారం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడతారు. అయితే, చలో మేడిగడ్డను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చలో మేడిగడ్డకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకుల వాహనాలను వరంగల్ దేవన్నపేట్ క్రాస్ రోడ్డు దగ్గర అడ్డుకుని గొడవ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు….చలో మేడిగడ్డను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.