తెలంగాణలో వ్యవసాయాన్ని దెబ్బతీసే కుట్ర : మాజీ మంత్రి సింగిరెడ్డి

-

తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసే కుట్ర జరుగుతోంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుకు సాయం చేయడం అంటే దేశ సౌభాగ్యానికి సహకారం అందించడమే అన్నారు. రైతుకు సాయం ఆ కుటుంబానికి సాయం కాదు, దేశానికి సాయం అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో 11 విడతల్లో 73 వేల కోట్లు రైతులకు అందించామని తెలిపారు. రైతుబంధు 25 వేల కోట్లు వృథా అని ఆరోపించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మరి ఏడాదిలో ఆ ఉపసంఘం ఏం తేల్చింది? అని ప్రశ్నించారు. సీఎం స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి. మరి ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. రైతుభరోసా అమలు చేయడం చేతగాక రైతుల మీద నిందలు వేస్తున్నారు.అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో ఉండొద్దని దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు సింగిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news