హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ABVP మహిళా కార్యకర్తపై HYD పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న ఓ కార్యకర్తను బైక్ పై వెంబడించిన కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది.
అయితే..రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనపై సీపీ సీరియస్ అయ్యారు.
ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు అవినాష్ మహంతి. ఆందోళన చేస్తూ పరుగులు పెడుతున్న ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి లాగింది ఫాతిమా. దీంతో ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ డిజి, సిపిలకు నోటీసులు అందాయి. ఈ తరుణంలోనే… కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు అవినాష్ మహంతి.