రాష్ట్రంలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా.. నేడు 614 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు ఆదివారంతో పోలిస్తే.. స్వ‌ల్పంగా పెరిగాయి. ఆదివారం రాష్ట్రంలో 429 క‌రోనా కేసులు న‌మోదు కాగ‌.. నేడు 614 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 32,932 క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో 614 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య‌ 7,83,448 కు చేరింది. అలాగే ఈ రోజు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఒక‌రు మృతి చెందారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ తో మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,107 కు చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2,421 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ క‌రోనా వ్యాప్తి త‌గ్గినా.. కేసులు పెర‌గుతున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం క‌రోనా వైర‌స్ గ‌ణ‌నీయంగా త‌గ్గింది. థ‌ర్డ్ వేవ్ లో రోజుకు 8 నుంచి 9 వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు అయ్యేవి. కానీ గ‌త కొద్ది రోజుల నుంచి 1000 లోపే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version