హుస్సేన్ సాగర్ లో 5500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని పేర్కొన్నారు సీపీ CV ఆనంద్. హైదరాబాద్ లో జరిగిన నిమజ్జనాలపై సీపీ ఆనంద్ మాట్లాడుతూ… బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో ఉంది..ట్రాఫిక్ విడుదల చేస్తున్నామన్నారు. 10.30 నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేసామన్నారు. గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని వివరించారు. దాదాపుగా అన్ని ఫ్లై ఓవర్ లు వదిలేసామని వెల్లడించారు.
ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి 6.30 కి మొదలయి .. 1.30 కి నిమజ్జనం పూర్తి అయ్యిందన్నారు. ఉత్సవ కమిటీ కి ధన్యవాదాలు చెప్పారు. సౌత్ వెస్ట్ లో కొన్ని మండపాల నిర్వాహకులు ఇంకా ముందుకు రాలేదు… వారు అర్దం చేసుకోవాలన్నారు. నిన్న సెలవు ప్రకటించి నిమజ్జనం చేసుకున్నాం…కానీ ఇష్టానుసారంగా వ్యవహరించారని కొందరిపై ఫైర్ అయ్యారు. పోలీసులకు, GHMC అధికారులకు సహకరించాలన్నారు. 15-20 అడుగుల విగ్రహాలు కొన్ని వచ్చి కొన్ని ప్లేస్ లలో ఆగిపోయాయి..అబిడ్స్ లో అలాగే కొన్ని ప్రాంతాల్లో టస్కర్ లు, వాహనాలు కండిషన్ బాగోలేక ఆగిపోయాయన్నారు.