కాంగ్రెస్ పార్టీ వాళ్లు పిసినారులు..మాకు టికెట్లు ఇవ్వలేదు – సీపీఐ నారాయణ

-

కాంగ్రెస్ పార్టీ వాళ్లు పిసినారులు..మాకు టికెట్లు ఇవ్వలేదని సీపీఐ నారాయణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని..కానీ మాకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చారని చురకలు అంటించారు. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలి..Brs పార్టీ బీజేపీకి b టీంగా అడుగులకుమాడుగులు ఒత్తుతుందని ఆరోపణలు చేశారు. ఆడవాళ్లకు లిక్కర్ వ్యాపారం ఏంటి….? బిడ్డను కాపాడాలి అంటే మోడీ కాళ్ళు మొక్కలా అని సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు.

వివేక్ మొన్నటి వరకు బీజేపీ ఉన్నాడు….ఇన్నాళ్లు అవినీతిపరుడు కాదు పార్టీ మారిన 10 రోజుల్లో వేల కోట్లు ఎలా సంపాదించాడని నిలదీశారు. అజయ్ కంటే తుమ్మలనే అందగాడు…అలాంటిది కేసీఆర్ తుమ్మలను తుమ్మ కంప అంటాడా…? అని ప్రశ్నించారు. తులసి మొక్కకు అందరూ పూజిస్తారు….మరి గంజాయి మొక్కను ఎవరన్నా పూజిస్తారా….? అని నిలదీశారు. పువ్వాడ ఇంట్లో మొలచిన గంజాయి మొక్క పువ్వాడ అజయ్….అనవసరంగా పువ్వాడ కుటుంబంలో పుట్టాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version