ఫార్మాసిటీ పోయి పారిశ్రామిక కారిడార్ వచ్చిందా? : కేటీఆర్ విమర్శలు

-

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఘాటు విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డి..నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని, అప్పుడు ఫార్మాసిటీ అని చెప్పి, ఇప్పుడు మాట మారుస్తారా? ప్రశ్నించారు. కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు..పారిశ్రామిక కారిడార్ వస్తుందని అని సీఎం రేవంత్ చెప్పడంపై విమర్శలు చేశారు.

‘అది నోరైతే నిజాలు వస్తాయి..అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని, పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా చెబుతోందన్నారు.ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు,పలు వేదికల మీద ప్రకటనలు చేశారని, తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొట్టారని దుయ్యబట్టారు.మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా? అని, ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అణిచివేయలేదా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version