సీఐ నాగేశ్వర్ కు ఒక్క పెళ్ళాం సరిపోదా..వాన్ని సజ్జనర్ కి ఆప్పగించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. . Ci నాగేశ్వర్ కి కొవ్వెక్కింది.. ఒక్క పెళ్ళాం సరిపోదా వాడికి.. అరెస్టు కాదు… సజ్జనర్ కి ఆప్పగిస్తే మంచిదన్నారు. గిరిజనుల పై జరిగిన దాడి పై నారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. గిరిజనుల బట్టలు విప్పే బదులు.. మీ ఇంట్లో ఆడవాళ్ళ బట్టలు విప్పుకోండని ఆగ్రహించారు.
గిరిజన మహిళలు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వరంగల్ లో ప్లాట్ ల వ్యాపారం చేస్తే పట్టించుకోరని ఫైర్ అయ్యారు. గిరిజనులు వ్యవసాయం చేసుకుంటే దాడులు చేస్తారని.. పేదల మీదనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాడి చేస్తుందని విమర్శలు చేశారు.
Trs..బీజేపీ ల మద్య వీధి నాటకం ఆడుతున్నారు.. ఇద్దరూ ఒకరిపై ఒకరు బుస కొడుతున్నారు, కానీ ఎవరు కాటు వేసుకోవటం లేదన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కెసిఆర్ బలపరచడం లేదని… రాజకీయాల్లో కెసిఆర్ గడప దాట కుండా మాటలు మాట్లాడితే ఎలా..? అని నిప్పులు చెరిగారు.