BREAKING : విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలుశిక్ష

-

BREAKING : విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలుశిక్ష పడింది. కోర్టు ధిక్కారం నేరం కింద పరారీ లో ఉన్న మద్యం వ్యాపారి విజయ మాల్యాకు 4 నెలలు జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది సుప్రీం కోర్టు. 2017 లో కోర్టు ఉత్తరువులను ధిక్కరిస్తూ 40 మిలియన్ల అమెరికన్ డాలర్లను విజయ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో నేడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.

9 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేత లో నిందితుడు గా ఉన్న విజయ మాల్యా… కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తరువులును ధిక్కరిస్తూ విదేశంలో ఉన్న “డియాజియో” కంపెనీ బ్యాంకు అకౌంట్ నుంచి విజయ మాల్యా తన కుమారుడు సిద్ధార్థ మాల్యా, ఇద్దరు కుమార్తెలు లియన్నా మాల్యా, తన్యా మాల్యా ల అకౌంట్లకు 40 వేల అమెరికన్ డాలర్లు బదలాయింపు చేశారు. వాస్తవాలను దాచి, 40 వేల అమెరికన్ డాలర్లు బదలాయింపు చేశారు.

“స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా” నేతృత్వంలోని పలు బ్యాంకులు ( కన్సార్టియమ్) కోర్టు ధిక్కారం నేరం కింద చర్యలు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. విజయ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు బ్యాంకులు. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలుశిక్ష పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version