కవిత చెప్పగానే కోర్టు నమ్మింది.. మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా? : సీపీఐ నారాయణ

-

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయాడు అంటూ సీపీఐ నారాయణ విమర్శించారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం పడమటి పల్లిలో సీపీఐ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అన్నారు. బీజేపీ విమోచర, విముక్తి దినం అంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రతిపక్షాలు బలపడకూడదనే మోడీ జమిలీ ఎన్నికలు అంటున్నాడు. ఇప్పుడు మినీ జమిలీకి సిద్ధం అవుతున్నాడు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడా వ్యాపారాల్లో ఎక్కువ మంది గుజరాత్ వాళ్లే.. బీజేపీ, మోడీ చెప్పే సనాతన ధర్మంలో మహిళలకు స్వేచ్ఛ ఉండదని తెలిపారు. కూతురు కోసం ఒకరు, కేసుల నుంచి తప్పించుకోవడం మరొకరు ఇద్దరూ తెలుగు రాష్ట్రాల సీఎంలు మోడీకి దగ్గరయ్యారంటూ సెటైర్ వేశారు. ఎమ్మెల్సీ కవితకి ఈడీ అధికారులు నోటీసులు పంపిస్తే.. కోర్టు నీకు వీలైనప్పుడు రా అని చెప్పింది. వంకాయలు.. బెండకాయలు కోసేది ఉందా..? నేను బిజీ అని కవిత చెప్పగానే కోర్టు నమ్మింది. మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధం బలంగా ఉందనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏముందని పేర్కొన్నారు సీపీఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news