అబిడ్స్లో క్రేన్ తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలిగిస్తోంది రెస్క్యూ టీమ్. భారీ గాలి వానకు నిన్న రాత్రి క్రేన్ కూలింది. ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా నిర్మాణం జరుగుతోంది. ఇక భారీ వర్షానికి క్రేన్ కూలడంతో పలు వాహనాలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కాగా హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్. మరో రెండు రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరింది వాతావరణ శాఖ. HYD సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. కొన్నిచోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మరో రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.