జోగుళాంబ గద్వాల జిల్లాలో మొసలి కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో చాలా గ్రామాల్లో చేపలు విపరీతంగా పడుతున్నారు. ఈ తరుణంలోనే.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం రేపింది. వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, తెలంగాణ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 24న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం.
వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం. pic.twitter.com/YS9TO0yVdQ
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2023