రబీ నుంచి పంటల బీమా టెండర్లు పిలవనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంటలు వేసిన ఎకరాలకే రైతు భరోసా నిధులు ఇస్తాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. రుణ మాఫీ చేశాం. ఇప్పటివరకు 18వేల కోట్లు రుణ మాఫీ చేశామని తెలిపారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. రబీ నుంచి పంటల బీమాకు టెండర్లు పిలుస్తామన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున పంటలను కొనుగోలు చేస్తామని తెలిపారు.
వ్యవసాయానికి పనికి రాని నిధులకు రైతు భరోసా నిధులు ఇవ్వమని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు . రూ.2లక్షలకు పైనున్న అమౌంట్ చెల్లిస్తే.. వారికి కూడా రుణమాఫీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ పై ప్రతిపక్షాలు విమర్శిస్తే.. ప్రజలు క్షమించరు అన్నారు. ప్రతీ రైతు ప్రీమియం అమౌంట్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు మంత్రి తుమ్మల.