తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు సమయం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కూడా ఇవాల్టితో ముగియనున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే రిపోర్టు విడుదలైంది.
ఇప్పటికే చాలా సర్వేలు రిలీజ్ అయినప్పటికీ ఈ సర్వే మాత్రం చాలా భిన్నంగా ఉంది. బీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణలో విజయం సాధించబోతుందని CSDP survey సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి CSDP survey అనే సంస్థ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం భారత రాష్ట్ర సమితి పార్టీకి 83 స్థానాలలో… కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలలో గెలుపొందుతుందని సర్వే అంచనా వేసింది. ఇక బిజెపి పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం పార్టీ ఏడు స్థానాలలో గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. అంటే ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న మాట.
తెలంగాణ ఎన్నికలపై సీఎస్డీపీ సర్వే విడుదల
- బీఆర్ఎస్ – 83
- కాంగ్రెస్ – 27
- బీజేపీ – 2
- ఎంఐఎం – 7