ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దుమ్ముగుడెం మండలంలో 10 రోజుల నుండి కరెంట్ కట్ సమస్య కొనసాగుతూనే ఉంది. దీంతో చీకటి లొనే పర్ణశాల రాముల వారి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. పది రోజుల నుంచి దుమ్ముగూడెం మండల ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా… అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
10 రోజుల నుండి ఆలయంలో ఆకండ జ్యోతిలోనే రాములవారు ఉన్నారు. ఇక చీకటి ఉండటంతో… పర్ణశాల రామాలయం చుట్టూ పాములు తిరుగుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులలో గ్రామ ప్రజలు సతమతమౌవుతున్నారు. తినడానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారు ఆ గ్రామస్తులు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒక వేళ ఇదే.. జరిగితే… ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వరదలు మరింత బీభత్సం సృష్టించనున్నాయి.