రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదిక ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘మంచిర్యాల ఎంసీహెచ్ ఆసుపత్రిలో కరెంటు లేక పోవడం వల్ల బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి ముందు ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. వీడియో లో ఉన్న ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్లో కరెంట్ కోతలతో బాలింతలు, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రికి జనరేటర్ పనిచేయడం లేదని వాపోయారు. జనరేటర్పై ప్రశ్నిస్తే.. సిబ్బంది దురుసుగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. డైలీ ఈ సెంటర్లో పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతాయని, వచ్చే వారంత దాదాపు నిరుపేదలే అని అన్నారు. కలక్టరేట్ కు కూతవేటు దూరంలో ఈ ఆస్పత్రి ఉందని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని బాధితులు కోరారు.