ఏపీ మాజీ ఎమ్మెల్యే పై పోక్సో చట్టం కింద కేసు నమోదు..!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్  పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడంతో.. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోక్సో కేసు నమోదయిందని అధికారులు తెలిపారు. కోడుమూరులో ఒక బాలికపై లైంగిక వేధింపులకు సుధాకర్ పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన పోలీసులు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుధాకర్ గతంలో కోడుమూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version