ఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్ వినూత్న నిరసన తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. హైదరాబాద్-లింగంపల్లి లోని అశోక్ నగర్ షోరూమ్ లో ఈ ఘటన జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రేంజ్ ఒక్కసారిగా పడిపోవడంతో నెలక్రితం షోరూమ్ లో వాహనాన్ని ఇచ్చినట్టు కస్టమర్ తెలిపారు. దీంతో నెలల తరబడి షోరూం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ షోరూంకు చెప్పుల దండ వేసి నిరసన తెలియజేశారు.
బ్యాన్ ఓలా, ఓలా మేకింగ్ హౌలా అంటూ కస్టమర్ షోరూమ్ ముందు ప్లకార్డులను ప్రదర్శించాడు. కస్టమర్ కు న్యాయం చేయాలని దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లు ఓలా సర్వీస్ సెంటర్ కు ట్యాగ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓలా కస్టమర్ సర్వీస్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సర్వీస్ సరిగ్గా లేదని.. గతంలో కర్ణాటకలోని కలబుర్గిలో ఓ కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ షోరూం తగలబెట్టిన విషయం తెలిసిందే.