స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. స్మితా సబర్వాల్ లో ఫ్యూడల్ భావజాలం ఉందని.. స్మితా సబర్వాల్ మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగ సొదరులను కించపరిచే వ్యాఖ్యలు అవి అంటూ నిప్పులు చెరిగారు. స్మితా సబర్వాల్ కు ఏదైనా వ్యక్తిగతంగా ఉంచుకోవాలని కోరారు.
స్మితా సబర్వాల్ వ్యాఖ్యల పై సిఎం దృష్టికి తీసుకెళ్తమని హెచ్చరించారు. ఐఏఎస్ గా ఉండి అలా మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చారు సీతక్క. ఫిజికల్ అండ్ మెంటల్ అంశాల పై వైకల్యాన్ని చూసి అన్ ఫిట్ అనొద్దన్నారు. ఐఏఎస్ అంటే బుద్ధి తో పనిచేయాలి ఫిజికల్ గా కాదని.. స్మితా సబర్వాల్ అంశాన్ని సిఎం దృష్టిలో ఉండి ఉంటదన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.