పదేళ్లలో రూ.8లక్షల కోట్ల అప్పులు : మంత్రి జూపల్లి

-

64 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రూ.70వేల కోట్లు అప్పు చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అర్హత ఉన్న కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా అభివృద్ధిలో వెనుక పడిపోయిందన్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాకు ఎంపీగా ఉండి ఏమి చేశారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పాలమూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news