పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కార్యకర్తల కారణంగానే నేను ఈ గౌరవ స్థానంలో నిలబడ్డానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ పాదయాత్రతో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని తెలిపారు.
ఈ దేశాన్ని కాపాడడం కోసం ఇందిరాగాంధీ తమ రక్తాన్ని ధారపోశారని పేర్కొన్నారు రేవంత్. ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఈ దేశంలో యువకులకు రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిచయం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబం దేశం అభివృద్ధి సాధించిందన్నారు. రాజీవ్ గాంధీ యువతను ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లు ఎంపీగా ఉన్నా గాని రాహుల్ గాంధీ మంత్రి గాని, ప్రధాని, రాష్ట్రపతీ వంటి పదవులకు ఆశ పడలేదు. ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. ఈ సారి కాంగ్రెస్ ని గెలిపిస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని కార్యకర్తలను కోరారు.