Tank Bund: అంబేద్కర్ విగ్రహం ముందు కట్టిన ప్రహరీ గోడ కూల్చివేత !

-

 

ట్యాంక్ బండ్ దగ్గర దారుణం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు కట్టిన ప్రహరీ గోడ కూల్చివేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడ పై దళిత సంఘాల నాయకులు…మండిపడ్డారు. అర్ధరాత్రి పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు దళిత సంఘాల నాయకులు.

wall

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబెడ్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన గోడను కూల్చివేశారు దళిత సంఘాలు. దీంతో ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నేతలు అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా, ట్యాంక్ బాండ్ అంబేద్కర్ చుట్టూ గోడ వెలసింది. ఏళ్లుగా లేని కొత్త సంప్రదాయానికి తెరలేపింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అంబేద్కర్ వేదికగా ఎన్నో , ఉద్యమాలు నిరసనలు చేశారు. అయితే.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ గోడ కట్టడంపై భగ్గుమన్నాయి దళిత సంఘాలు. అయితే… అర్ధరాత్రి పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు దళిత సంఘాల నాయకులు. గోడ ధ్వంసం చేశారు. ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version