తెలంగాణలో ఎక్కడ కరెంటు కోతలు లేవు – డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణలో ఎక్కడ కరెంటు కోతలు లేవు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు బంధు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారని..  రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్​ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు.

Deputy CM Bhatti Vikramarka about telangana power cuts

విద్యుత్​ సబ్సిడీ కింద రూ.3,924 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.  రాష్ట్రంలో ఎక్కడా పవర్​ కట్​ లేదని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా నిధులు రూ.734 కోట్లు చెల్లించామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version