కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం : వైఎస్ షర్మిల

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కూటమి, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటుంటే.. ఈ ఇద్దరి కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. రెండింటి వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జోష్ చూపిస్తున్న షర్మిల ఇటు జగన్ ను.. అటు చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఏపీలో బస్సు యాత్రం చేపట్టిన వైఎస్ షర్మిల చిప్పగిరిలోని విజయదశరకట్టలో గురువారం రాత్రి బస చేశారు. ఇవాళ ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు చేరుకున్న షర్మిల మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు సమన్వయంతో పని చేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.

‘ల్యాండ్, శాండ్ మాఫియా అన్నీ చేసి దోచుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు కార్మిక మంత్రిగా గుమ్మనూరు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైంది.. వైఎస్ శిలాఫలకం వేసిన ప్రాజెక్టుకు జగన్ మళ్లీ శిలాఫలకం వేశారు. వైసీపీ ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే. కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’ అని వైఎస్ షర్మిల అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version