రుణమాఫీ విషయంలో బ్యాంకర్స్ పై భట్టి సీరియస్..!

-

మేము 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చాము. రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయి. రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదు అని ప్రజా భవన్ లో బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నము. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తాం. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నాం. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నాం. ఇది వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయి.

వ్యవసాయం తో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుంది. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నము. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుంది. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించండి ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నాం. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయండి అని డిప్యూటీ సీఎం భట్టి బ్యాంకర్స్ కు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version