వివాదస్పద, ప్రభుత్వ భూముల వివరాలు వెల్లడించాలి.. హైకోర్టులో పిటిషన్

-

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూముల గురించి తెలిసేలా సంబంధిత కార్యాలయాల్లో వివరాలు తెలిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి చంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.


చట్టప్రకారం ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను రెవెన్యూ కార్యాలయాలతో పాటు, స్థానిక
సంస్థల కార్యాలయాల్లోనూ ప్రచురించి అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని చంద్రసేనా రెడ్డి కోర్టును కోరారు. దీనివల్ల అమాయకులు వివాదాస్పద భూములు, భవనాలను కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడతారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news